మంచి ఆహారంతో కూడా నీరసం వస్తోందా?
ఇంటర్నెట్ డెస్క్ : ఒక్కొక్కసారి మంచి ఆహారం తీసుకుంటున్నా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది అనుభవమే. జంక్ ఫుడ్ తినకుండా ప్రోటీన్లు, పండ్లు తింటున్నా కూడా నీరసంగా ఉంటోందంటూ వైద్యుల వద్ద వాపోతూ ఉంటారు. ఇన్‌ఫ్లమేషన్, నెలసరి సమస్యలు, నిద్రలేమి, ఒత్తిడి వంటివి దీనికి ముఖ్య కారణాలుగా న్యూట్రిషియన్లు చెప్తూంటారు. ఈ కారణాల వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట.
. సాధారణంగా మంచి ఆహారం అంటే ప్రోటీన్లతో నిండిన ఆహారం మాత్రమే అనే భ్రమలో ఉంటారు అమ్మాయిలు. కానీ ఇది నిజం కాదు, ఆహారంలో ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఇదే సమతుల్య ఆహారం.
. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తినే సమయం కూడా చాలా ముఖ్యమే. రాత్రి పడుకునే ముందు తినడం, ఉదయం లేచిన తర్వాత చాలా లేటుగా ఆహారం తీసుకోవడం చాలా ప్రమాదం. ప్రతీ రెండు గంటలకొకసారి కొద్ది మొత్తంలో మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే శక్తి స్థాయిలు సరిగ్గా ఉంటాయి. లేకపోతే నీరసం వస్తుంది.
. నీరు సరిగ్గా తాగకపోయినా..కాఫీలు, టీలు అధికంగా తాగినా కూడా అలసటగా అనిపిస్తుంది. అందుకే అన్ని రకాలుగా ఆహారం విషయంలో జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

