Andhra PradeshHome Page SliderNews AlertPolitics

‘పాక్ కోసం మాట్లాడేవాళ్లని అక్కడికే పంపిస్తాం’..పవన్ కళ్యాణ్

పాకిస్తాన్‌ అనుకూల రాజకీయ నాయకులు అక్కడికే వెళ్లిపోవచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మతం పేరుతో మనుషుల్ని పిట్టలు కాల్చినట్లు కాల్చేసినా పాకిస్తాన్‌కు అనుకూలంగా కొందరు  మాట్లాడుతున్నారని, అలాంటి వారు ఆ దేశానికే వెళ్లిపోవాలని మండిపడ్డారు. మంగళగిరిలో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలలో ఓట్లు, సీట్ల కోసం ఇలా మాట్లాడకూడదని పేర్కొన్నారు.