Home Page SliderNewsPoliticsTelanganatelangana,

‘ కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానిస్తాం’..రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రతిపక్షనేత కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనను స్వయంగా తమ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి ఈ నెల 9న అసెంబ్లీకి రావలసిందిగా ఆహ్వానిస్తాం అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడి, తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. తన పిల్లలకు మంచి చెడులు చెప్పవలసిన బాధ్యత లేదా? అని నిలదీశారు. హరీశ్‌రావు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై బురద జల్లుతుంటే చూస్తూ ఊరుకోవడం మంచి పద్దతేనా? అంటూ ప్రశ్నించారు. వారు చిల్లర పనులు చేస్తే మందలించాలన్నారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం ప్రతిపక్షనేత బాధ్యత కాదా? అన్నారు. ప్రతిపక్షనేత కుర్చీ ఖాళీగా ఉంచడం రాష్ట్రానికి కూడా మంచిది కాదని హెచ్చరించారు. ప్రజాతీర్పును గౌరవించి, పాలన చేసుకోనివ్వాలి కదా. రాష్ట్రానికి మంచి చేయడానికి చేతులు కలపాలని, 17 మంది ఎంపీలతో కలిసి కూర్చోబెట్టి, కేంద్రం నుండి నిధులు సాధించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఈ నెల 7,8,9 వ తేదీలలో తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటామని దానికోసం స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షనేత కేసీఆర్‌కు, బీజేపీ నుండి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను అహ్వానిస్తారు అని పేర్కొన్నారు.