Home Page SliderNationalNews AlertPolitics

ప్రజల సంక్షేమం కోసమే మద్య నిషేధం అమలు చేస్తాం…

బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సరల్‌ జిల్లాలో గుడుంబా, కల్తీసారాతో గత రెండు రోజుల్లోనే 40 మందికి పైగా చనిపోయిన ఘటన రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేస్తోంది. కల్తీ మద్యం మరణాలు ఇదే మొదటిసార కాదు, గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మద్య నిషేధం వల్లనే ఇలాంటి ఘటనలు పునరువృతం అవుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మద్య నిషేదంపై పునరాలోచించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

అయితే.. మద్య నిషేదంతో సమస్యలొస్తున్నాయని, కల్తీ మద్యం వస్తుందని ఎత్తివేయటం సరికాదన్నారు సీఎం నితీష్‌కుమార్‌. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాన్ని నిషేధించలేం కదా అని ప్రశ్నించారు.  ప్రజల సంక్షేమం కోసం ఏటా లక్షల కోట్ల నష్టం వచ్చినా మద్యనిషేధం అమలు చేసి తీరుతామని నితీష్‌కుమార్‌ ప్రకటించారు. ఇప్పటికీ లక్ష కోట్లు ఆదాయం కోల్పోయిన ప్రజల సంక్షేమం కోసం మద్యనిషేధం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం నితీష్‌కుమార్‌. బీహార్‌ మద్యం మృతుల కుటుంబాలకు పరిహారాన్ని కూడా సీఎం నితీష్‌కుమార్‌ నిరాకరించారు.