Andhra PradeshHome Page Slider

“తప్పుడు పోస్టులు పెట్టేవారి ఇళ్లకు వెళ్లి తంతాం”: టీడీపీ నేత

ఏపీలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార పక్షంపై ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకురాలు అనిత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ..ఏపీలోని మహిళలంతా బాధతో ఉన్నారన్నారు. అయితే వైసీపీలోని మహిళా మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో తన పదవి పోయినా..ఇంకా పదవి ఉందనే భ్రమలోనే వాసిరెడ్డి పద్మ  ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల సమస్యల గురించి మాట్లాడుతుంటే..ఇంకో వైపు సీఎం జగన్ మాత్రం పవన్ భార్య గురించి మాట్లాడుతున్నారని అనిత మండిపడ్డారు. అయితే ఇకపై ఫిర్యాదులు కాకుండా..తప్పుడు పోస్టులు పెట్టే వారి ఇంటికి వెళ్లి తంతామని హెచ్చరించారు.