చెప్పిన మాట వినని ఎంపీలను గెంటేస్తాం: ట్రూడో
వచ్చే ఎన్నికల్లోనూ లిబరల్ పార్టీని తానే నడిపిస్తానని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారని గ్లోబల్ న్యూస్ పేర్కొంది. అక్టోబర్ 28 లోపు పదవి నుంచి దిగిపోవాలని 24 మంది MPలు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. మీ మాటను లెక్కచేయకుంటే పార్టీ నుంచి వారిని గెంటేస్తారా అన్న ప్రశ్నకు ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు, పార్టీ వర్గాలతో విస్తృతంగా చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఆయన తీరు పార్టీలో ఉన్న ఎంపీలను నిరాశపరిచిందని వ్యతిరేక MPలు అంటున్నారు.

