శారదా పీఠాన్ని కూల్చేస్తాం
విశాఖలోని సుప్రసిద్ధ శారదా పీఠం నిర్వాహకులకు ఏపి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.ప్రస్తుతం ఉన్న పీఠంలో ప్రభుత్వ భూమి ఉందని అందులో చేపట్టిన నిర్మాణాలు తక్షణమే తొలగించి ఆ భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని నోటీల్లో పేర్కొంది.లేని పక్షంలో అక్రమ నిర్మాణాలు తామే కూల్చివేసి ఆ ఖర్చు ని కూడా పీఠం నుంచే వసూలు చేస్తామని హెచ్చరించింది. చినముషిడివాడలోని శారదా పీఠంలో 9 శాశ్వత కట్టడాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని తెలిపింది.వాటిని వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.