బలంగా తిరిగొస్తాం
హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ మంత్రి కేటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.తెలంగాణలో ప్రజల తరుఫున పోరాడుతున్న బీ.ఆర్.ఎస్. గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా తనను అనవసర కేసులో ఇరికించారని ఆరోపించారు. తన మాటలు రాసిపెట్టుకోవాలంటూ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు.తాము త్వరలోనే బలంగా తిరొగొస్తామని హెచ్చరించారు.మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సత్యం కోసం పోరాటం చేస్తున్నానని,ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు.