Andhra PradeshHome Page Slider

మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం

ప్రత్యేక విమానాల్లో తరలింపునకు చర్యలు
ఢిల్లీలో ఏపీ విద్యార్థుల సహాయానికి కంట్రోల్ రూమ్
విద్యార్థులను కాపాడుతామన్న మంత్రి బొత్స సత్యనారాయణ

మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న క్రమంలో, అక్కడ ఉన్న ఏపీ విద్యార్థులను గుర్తించి, వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్యాశాఖామత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మణిపూర్ లో 150 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని తెలిపారు.ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని తెలిపారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస చెల రేగింది.

గిరిజనలు గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రార్థన స్థలాలు వాహనాలకు నిరసనకారులు నిప్పంటించి భారీగా ఆస్తి ప్రాణ నష్టం కలిగించారు. మణిపూర్ ఎన్ఐటి క్యాంపస్ లో 150 వరకు ఏపీ తెలంగాణకు చెందిన తెలుగు విద్యార్థులు ఉన్నారు. వారిలో 70 మంది వరకు ఏపీకి చెందినవారు ఉన్నట్లు అక్కడ విద్యార్థులు మీడియాకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. వారంతా అక్కడ దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. తమను ఆదుకోవాలని కనీసం తాగేందుకు నీరు దొరకటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుల విజ్ఞప్తికి స్పందించిన సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలకు స్పందించిన అధికార యంత్రాంగం తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. ఇటు కేంద్రంతోను మరోవైపు మణిపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. తెలుగు విద్యార్థులకు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ తరలించే ఏర్పాట్లు చేశారు. మణిపూర్ ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది. దీంతోపాటు ప్రభుత్వం ఇప్పటికే పౌర విమానా శాఖను ఒప్పించి ప్రత్యేక విమాన సర్వీసు ద్వారా మనిపూర్లో ఉన్న ఏపీ విద్యార్థులను రప్పించేందుకు ఏర్పాట్లు చేసింది.