ఇండిగో విమానం పేల్చేస్తాం..
ఇండిగో విమానం పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ముంబై ఎయిర్ పోర్ట్ చండీగఢ్ నుంచి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు పుకార్లు సృష్టించారు. ఈ క్రమంలోనే విమానం ముంబై ఎయిర్ పోర్ట్ సేఫ్ ల్యాండ్ అయింది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు.