ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల్లోంచి తప్పించాం
ఎన్నికల విధుల్లోంచి తప్పించాలని ఉపాధ్యాయులే కోరారన్నారు ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోంచి తప్పించారంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేసి వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ఉపాధ్యాయులతోనే లోకేశ్ మాట్లాడితే బాగుంటుందన్నారు బొత్స. బోధించడం తప్ప మరే విధులు వద్దని ఉపాధ్యాయులు పదేపదే కొరడం వల్లే వారిని విద్యకు మాత్రమే పరిమితం చేశామన్నారు. మొత్తంగా ఎన్నికల విధులకు సంబంధించి సర్కారు వ్యూహం అమలైనట్టుగా కన్పిస్తోంది. జగన్ సర్కారు అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.