ఈ తీర్పును స్వాగతిస్తున్నాం..కిషన్ రెడ్డి
తెలంగాణ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు విధించిన శిక్ష సరైనదేనని పేర్కొన్నారు. మారణహోమాన్ని సృష్టించి, ఎన్నో కుటుంబాల కన్నీటికి కారణమయినవారికి ఉరే సరైన శిక్ష అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదానికి, హింసకు తావు లేదని, ఈ తీర్పుతో బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. 12 ఏళ్లుగా ఈ ఘటన ఒక పీడకలలా వెంటాడుతోందని బాధను వ్యక్తం చేశారు.

