‘కేంద్రం ఈనిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’-ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో చేసిన కులగణనలలో ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర కులాలను పరిగణనలోకి తీసుకునేవారు కాదన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ విషయం ఎన్నోసార్లు డిమాండ్ చేశారన్నారు. తెలంగాణలో దేశంలోనే తొలిసారిగా కులగణన చేశాం అని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేశాం. తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం అని పేర్కొన్నారు. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రేపు గవర్నర్‌ను తెలంగాణ కాంగ్రెస్ BCనేతలు కలవనున్నారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలపనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లబిల్లును ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

