Home Page Sliderhome page sliderNationalNewsNews AlertTrending Todayviral

చైనా సరిహద్దుపై చర్చించాల్సిందే : జైరాం రమేష్

చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్ లో చర్చించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ డిమాండే చేశారు. 1962 లో చైనా దురాక్రమణపై లోక్ సభలో చర్చించినప్పుడు, భారత్ వర్సెస్ చైనా మధ్య ఉన్న సరిహద్దు వివాదంపై ఎందుకు చర్చించకూడదో చెప్పాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చైనా సరిహద్దు సమస్యపై చర్చకు అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
‘ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రముఖ ఉత్పాదక శక్తిగా చైనా ఎదుగుతుంది. చైనా నుంచి ఎదురయ్యే క్లిష్టమైన ఆర్థిక, భద్రతాపరమైన సవాళ్లపై జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించడం ఎంతైనా అవసరమని’ కాంగ్రెస్ నేత జైరాం స్పష్టం చేశారు. పాక్కు మద్దతుగా నిలిచిన చైనా… మరో వైపు మోదీ ప్రభుత్వం చెబుతున్నట్లు భారత్-చైనా దౌత్య పరంగా సంబంధాలు బాగుంటే, మరి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్కు చైనా ఎందుకు మద్దతుతో కూడిన సాయం చేసిందని జైరాం రమేష్ ప్రశ్నించారు.
పాక్కు చైనా లైవ్ ఇన్పుట్స్ … ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, పాకిస్థాన్కు భారత సైనిక కార్యకలాపాలపై లైవ్ ఇన్పుట్స్ అందజేసిందని మన డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ప్రకటించిన దాని గురించి ఏమంటారని జైరాం రమేశ్ డిమాండే చేశారు.త్వరలో పాక్ కు చైనా యుద్ధ విమానాలు…
త్వరలోనే పాకిస్థాన్ చైనా నుంచి జే-35 స్టెల్త్ విమానాలు అందజేయనుందని జైరాం రమేష్ తెలిపారు. చైనా అరుదైన ఎర్త్ మేగ్నైట్స్, స్పెషల్ ఫెర్టిలైజర్స్, టన్నెల్-బోరింగ్ యంత్రాలను భారత్కు ఎగుమతి చేయకుండా పరిమితులు విధించిందని ఆయన గుర్తు చేశారు.వాస్తవానికి తూర్పు లద్ధాఖ్లో వాస్తవ నియంత్రణ రేఖపై మే 2020 నాటి స్థితిని పునరుద్ధరించని ఆంశంపై పార్లమెంట్లో ఎందుకు చర్చించకూడదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.