“వి మిస్ యూ” సుషాంత్ సింగ్ రాజ్‌పుత్
బాలీవుడ్ స్టార్ హీరో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా ఈ యంగ్ హీరో 3ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దుఃఖంలో ముగినిపోయారు. ఈ రోజు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన రోజు కావడంతో ఆయన అభిమానులు సుషాంత్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మూడేళ్లు అయినా..ఇప్పటివరకు ఆయన మరణంపై నెలకొన్న అనుమానాలను ఎవరు క్లియర్ చేయలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో “సుషాంత్ వి మిస్ యూ” ఇది “బ్లాక్ డే” అని ట్వీట్ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో “Black day” ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.