Breaking Newshome page sliderHome Page SliderTelangana

నకిలీ కారు గుర్తులపై ఈసీకి ఫిర్యాదు చేసాం

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బీఆర్ఎస్ నేతలు తమ వాదనను వినిపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ గుర్తు అయిన కారును పోలిన ఎనిమిది నుండి తొమ్మిది గుర్తులు ఈసీ జాబితాలో ఉన్నాయి. 2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో మేము కేవలం 5 వేల ఓట్లతో ఓడిపోయాం. కానీ ప్రచారం చేయని రోడ్ రోలర్ గుర్తుకే 27 వేల ఓట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది?” అని ప్రశ్నించారు.ఇలాంటి గుర్తుల కారణంగా ఎన్నో సీట్లలో తాము ఓడిపోయామని కేటీఆర్ వివరించారు. “ఇటీవల జరిగిన ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లు తక్కువ ఓట్లతోనే కోల్పోయాం. ఇందులో ప్రతి ఒక్క ఓటు విలువైనది. కారు గుర్తు పోలిన గుర్తులు బీఆర్ఎస్ ఓటర్లను దారితప్పించేలా ఉన్నాయి. ఈ అంశాన్ని గమనించి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం” అని చెప్పారు.ఈ బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో కేటీఆర్‌తో పాటు, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేతలు వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉన్నారు. ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు, ఇతర పార్టీల దాడులపై ఫిర్యాదులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఫేక్ ప్రచారాలపై ఈసీకి వివరించారు.