InternationalNews

ఇండియా ఎలా ఉండాలో ఇతరులు మాకు చెప్పనక్కర్లేదు

ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో భారత్‌కు చెప్పనవసరం లేదని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ చెప్పారు. 15 దేశాల UN భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారతదేశం తాజాగా చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం అనేక దేశాలు కలసికట్టుగా కార్యక్రమాలను నిర్వహించాలని భారత్ పిలుపునిచ్చింది. శక్తివంతమైన ఐక్యరాజ్యసమితిలో నాన్-పర్మనెంట్ మెంబర్‌గా భారతదేశం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనుంది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశపు మొదటి మహిళా శాశ్వత ప్రతినిధి కాంబోజ్ అధ్యక్షుని స్థానంలో కూర్చుంటారు. భారతదేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.


భారతదేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో ఇతరులెవరూ కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. భారతదేశం బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత అని మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2500 సంవత్సరాల నాటికే మూలాలు ఉన్నాయి, ఇండియా ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లిందన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అవి నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్, ప్రెస్ చాలా శక్తివంతమైన సోషల్ మీడియా ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమని చెప్పారు.

ప్రతి ఐదేళ్లకోసారి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య విధానం ద్వారా పాలకులను ఎన్నుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం ఉండటానికి, ఇష్టాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం ఇండియాలో ఉందన్నారు. ఇండియా వేగంగా సంస్కరించబడుతోందని… రూపాంతరం చెందుతోందన్నారు. ఇండియా గమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందన్నారు. అది చేయండి.. ఇది వినండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటానంటూ ఆమె స్పీచ్ ముంగించారు. ఈరోజు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కి… శాశ్వత ప్రతినిధి హోదాను పొందిన తొలి భారతీయురాలు రుచిరానే.

 Indian envoy Ruchira Kamboj