మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం…
నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ట్రిబుల్ ఆర్ చిత్ర యూనిట్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోందన్నారు. యావత్ రాష్ట్రం తరఫున.. కీరవాణి, రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రాంచరణ్‌తోపాటు ట్రిబుల్ ఆర్ టీంకు అభినందనలు తెలియజేస్తునన్నారు. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నామంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.