Home Page SlidermoviesNationalNews Alert

‘పుష్ప-2’ ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి..శక్తిమాన్ ప్రశంసలు

‘శక్తిమాన్‌’గా TV ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా ఇటీవల పుష్ప-2 ది రూల్ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ చిత్రం పరమాద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఇలాంటి చిత్రాలను చూసి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక, నిర్మాతలు తెలుసుకోవాలన్నారు. ఎక్కడా అశ్లీలత లేకుండా చూడచక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు. కేవలం డబ్బుతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు. సరైన ప్రణాళిక, విజన్‌తో దీనిని రూపొందించినట్లు సినిమా చూస్తే అర్థమవుతోందని, ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి తెరపై కనిపిస్తోందన్నారు. ఈ చిత్రం చూసాక, అల్లు అర్జున్ నటించిన గత చిత్రాలు చూడాలనే కోరిక కలిగిందని పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.