కృష్ణవంశీ రంగమార్తాండ ఇక ఓటీటీలో చూసేయండి
రంగ మార్తాండ మూవీ మార్చి 22న విడుదలైంది. ఇది వీక్షకుల నుండి డివైడ్ టాక్ వచ్చింది. అయితే కుటుంబ విలువలతో నిర్మించిన ఈ చిత్రంపై మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ ధియేటర్లకు వెళ్లలేక చూడలేనివారు రంగమార్తాండ OTTలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూశారు. ఎమోషనల్ డ్రామా జోనర్‌లో ఉన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా 2 గంటల 33 నిమిషాలు పాటు సాగుతుంది. రంగమార్తాండ ప్రివ్యూ కోసం OTT ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ హక్కులు పొందింది. పెద్దలను గౌరవించడం, భావోద్వేగాలను బయటకు తీసుకురావడంలో సినిమా అంతంతగానే ఉందన్న భావన కలిగినప్పటికీ కృష్ణ వంశీ మార్క్ మూవీగా గుర్తింపు పొందింది.

ఈ సినిమా మొదట తెలుగు భాషలో రూపొందించగా… ఇతర భాషలలో డబ్ చేశారు. OTT ప్లాట్‌ఫారమ్ ఇతర ప్రాంతాల వారికి అర్థమయ్యేలా చూసేందుకు అమెజాన్ సిద్ధం చేసింది. రంగమార్తాండ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు దీనిని తక్షణం వీక్షించవచ్చు. రంగస్థలంలో నిష్ణాతుడైన వ్యక్తి, రంగమార్తాండగా గుర్తింపు పొందిన తర్వాత ఏం జరిగిందన్నది చిత్ర కథాంశం. రంగస్థల వృత్తిని విడిచిపెట్టిన తరువాత, తన ఆస్తిని తన పిల్లలకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం, తర్వాత వచ్చే సమస్యలను భర్య వివరించినా , పట్టించుకోకపోవడం.. తర్వాత జరిగే కుటుంబ ఘర్షణలను కృష్ణవంశీ అద్భుతంగా తెరకెక్కించాడు.