Home Page SliderTelangana

మాట వినని అధికారులకు ఈటల వార్నింగ్..

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బాస్ ల ఆదేశాల మేరకు కాదు.. చట్టప్రకారం నడుచుకోవాలని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. లేదంటే శ్రీలక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా ఆరెంజ్ బుక్ మెయిన్ టైన్ చేస్తున్నామని, ఆ బుక్ అందరి పేర్లు రాసుకుంటున్నామని హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఈటల వరంగల్ జిల్లాలో పర్యటించారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా అధికారులు పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయటపెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.