వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై లైంగిక వేధింపులకేసు..
వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో లైంగిక వేధింపులు చోటుచేసుకున్నాయి. నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్. వెంకటేశ్వరన్ మహీళ గార్డులను లైంగిక వేధిస్తూన్నారని ఆరోపణలు వచ్చాయి. ఉన్నతి పదవిలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలను నిర్వర్తించాల్సిందిపోయి తన కామవాంఛను తీర్చమని వేధిస్తూడని కాజీపేట పీఎస్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్‌పై నిట్ మహిళా సెక్యూరిటీలు ఫిర్యాదు చేశారు. తమని లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వరన్ ఆరాచాకాలను ఓ మహిళ దైర్యంగా బయట పెట్టి పోలీసులకి పట్టించారు. వివరాల్లోకి వేళితే వెంకటేశ్వరన్ గత కొన్ని రోజులగా ఎంతో మంది మహిళ గార్డులను లైంగికంగా వేధించారని, తాను ఒక మహిళ గార్డుపై కన్ను వేయటం ఆమెతో మంచిగా మట్లాడటం, తాను ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని వంట చేయటానికి ఒక పని మనిషి కావాలని తెలిసిన వారు ఉంటే చెప్పమని ఫోన్ నెంబర్స్ తీసుకునేవాడని, మరుసటి రోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అంటూ మెసేజ్ చేసేవాడు

అయితే ఇటీవల వరంగల్‌లోని ఉర్సు కరీమాబాద్‌కు చెందిన ఒక మహిళ నిట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. చెన్నై వాసి ఎస్. వెంకటేశ్వరన్ ఆమె పై కన్నేశాడు. 3 నెలలుగా ఆమెను ప్రశాంత్‌నగర్‌లోని తన ఇంటికి రమ్మని, ఒంటరిగా ఉన్నానని, వంట చేసి పెడితే, తన అవసరాలను తీరిస్తే తనని బాగా చుసూకుంటాని, ఇంకా ఎన్నో అసభ్యకరంగా మెసేజ్‌లను పంపుతున్నారని ఆమె తెలిపారు. అయితే దానికి ఆమె అంగీకరించకపోవటంతో తనపై విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు కూడా కేసు మోపరని ఆమె పేర్కోన్నారు. అయితే ఆమె ఈ గురవారం తన భర్తని వెంటపెట్టుకొని వెంకటేశ్వరన్ ఇంటికి వెళ్లింది. తనని ఎందుకు ఇంటికి పిలుస్తూన్నారని, ఫోన్లు, మెసేజ్లు ఎందుకు చేస్తున్నారని నిలదీసింది. దీంతో వెంకటేశ్వరన్ ఎదురు తిరగటంతో పోలిసులకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దగిన పోలిసులు వెంకటేశ్వరన్ అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.