Breaking NewscrimeHome Page SliderTelangana

వ‌రంగ‌ల్ మే ….టైగ‌ర్ కా హుకుం

వరంగల్‌ అడవుల్లోకి చాల ఏళ్ల త‌ర్వాత పెద్దపులి ఎంట‌ర్ అయ్యింది . ఛత్తీస్‌గఢ్ దండ‌కార‌ణ్యం నుంచి పెద్దపులి వరంగల్‌లో అడ‌వుల్లోకి ప్రవేశించింది.ఈ విష‌యాన్ని రిజ‌ర్వ్ ఫారెస్ట్ అధికారులు గుర్తించి బుధ‌వారం స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండరం చెలిమల, డోలి అభయారణ్యం మీదుగా కొత్తుగుంపు, బోదాపురం అటవీ మార్గంలో గోదావరి తీర ప్రాంతంలోకి చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇక్కడి పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా ఆ మార్గమే రాకకు సులువైందని నిర్ధారించారు.బోదాపురం సమీప పెద్దలంక భూముల్లో సాగు చేస్తున్న పుచ్చపంటల గుండా దాదాపు ఐదుకు పైగా చిన్నపాటి పాయలు దాటి గోదావరి ప్రవాహం వైపు వెళ్లింది. ఆ నదిని సైతం దాటినట్లు ఆవలి ప్రాంతమైన మంగపేట మండలం చుంచుపల్లి, రాజుపేట ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.వ‌రంగ‌ల్ అడ‌వుల్లోకి వ‌చ్చినందుకు సంతోషించాలో లేదా స‌మీప గ్రామాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల పై దాడి చేస్తుందేమోన‌న్న భ‌యంతో అప్ర‌మ‌త్త‌మ‌వ్వాలా అనే సంశ‌యం కూడా .మొత్తం మీద పెద్ద‌పులి విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఫారెస్ట్ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.