Breaking NewsHome Page Sliderhome page slidermoviesNewsNews AlertTrending Todayviral

వార్ 2 vs కూలీ.. ఓపెనింగ్ డే కలెక్షన్స్…?

బాక్సాఫీస్ వద్ద ఈ వారం బిగ్ క్లాష్ జరిగింది. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ ఒకేరోజు (ఆగస్ట్ 14) విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. రెండు సినిమాలు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందినవైనా, బాక్సాఫీస్ వసూళ్ల పరంగా గట్టిపోటీ నడుస్తోంది. ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సినిమా కావడంతో టాలీవుడ్‌లో ‘వార్ 2’పై భారీ హైప్ ఏర్పడింది. కానీ బాలీవుడ్ ఆడియన్స్‌కి ఇది కొంతవరకూ రొటీన్ స్పై థ్రిల్లర్‌లా అనిపించిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ రూ.25 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని తెలిసింది. డే 1 కలెక్షన్స్ చూస్తే.. హిందీలో: రూ.40 కోట్లు గ్రాస్, తెలుగులో: రూ.30 కోట్లు గ్రాస్, తమిళంలో: రూ.1 కోటి, ఓవర్సీస్: రూ.15 కోట్లు. అంటే మొత్తంగా మొదటి రోజు వసూళ్లు రూ.85 నుండి రూ.90 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. సినిమా యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఆగ‌స్ట్ 14న విడుద‌లైన మ‌రో సినిమా కూలీ. రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ సినిమా మాత్రం అంచనాలకు మించి సెన్సేషనల్ ఓపెనింగ్ అందుకుంది. భారీ కాస్టింగ్, మాస్ యాక్షన్ ప్యాకేజ్‌తో ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ నుండి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే.. దాదాపు రూ.150 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా వచ్చే మూడు రోజులు సెలవులు కావ‌డంతో, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగానే వ‌సూళ్లు రాబ‌ట్ట‌నున్న‌ట్టు చెబుతున్నారు. ‘వార్ 2’కు ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బలంగా ఉండగా, ‘కూలీ’కి రజినీ మాస్ క్రేజ్ ప్ల‌స్‌పాయింట్. ఇప్పటివరకు అందిన‌ సమాచారం ప్రకారం, ఫస్ట్ డే బాక్సాఫీస్ పరంగా ‘కూలీ’ ముందంజలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.