Home Page SliderTelangana

ఎప్పటి నుంచో కోరుతున్నా.. ఈనాటికి OUలో ముళ్ల కంచెలకు మోక్షం..

లాలాపేట: ఓయూ పరిపాలనా భవనం ముందు వేసిన ముళ్ల కంచెలను గురువారం వర్సిటీ అధికారులు తొలగించారు. వీటిని తొలగించాలని కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. సమస్యలు వినడానికి వీసీ అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా కంచెలు తొలగించడంపై విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.