News AlertTrending Today

సంక్రాంతి బరిలో తగ్గేదేలే

వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి.. 2023 సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. ఈ రెండు చిత్రాలపై ఆడియన్స్‌లో అమితాసక్తి ఉంది. అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్..మాత్రమే కాకుండా.. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా సంక్రాంతి పందెం కోళ్లని బరిలో చూడ్డానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ-మెగాస్టార్ చిరంజీవి సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నారంటే ఆ మజానే వేరు. అయితే ఈసారి ఈ రెండు భారీ చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తుండటంతో.. నిర్మాతలు అయితే ధీమాగా ఉన్నారు. రెండు సినిమాల్లోనూ హీరోయిన్ శ్రుతి హాసన్. ఇక వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యకి వీరాభిమాని అయితే.. వాల్తేరు వీరయ్య చిత్ర దర్శకుడు బాబీ.. మెగాస్టార్‌కి వీరాభిమాని కావడం మరో విశేషం. ఈ రెండు సినిమాల్లో ముందుగా వీర సింహా రెడ్డి.. జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. చిరంజీవి వాల్తేరు వీర‌య్య జ‌న‌వ‌రి 13న రానుంది.

ఇప్ప‌టికే రెండు సినిమాల‌కు సంబంధించిన ట్రైలర్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో దూకుడు చూపించిన వాల్తేరు వీర‌య్య‌.. ఇప్పుడు మ‌రో విష‌యంలోనూ స్పీడు చూపించింది. అదే ట్రైల‌ర్ వ్యూవ‌ర్స్ రికార్డ్‌లో …ముందుగా విడుద‌లైన వీర సింహా రెడ్డి ట్రైల‌ర్‌కు 24 గంట‌ల్లో 8.01 మిలియ‌న్స్ వ్యూస్ వ‌చ్చాయి. అలాగే 382600 లైక్స్ వ‌చ్చాయి. వాల్తేరు వీర‌య్య విష‌యానికి వ‌స్తే ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 11.77 మిలియ‌న్స్ వ్యూస్ వ‌చ్చాయి. 471800 లైక్స్ వ‌చ్చాయి.