NewsNews AlertTelangana

ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం `ఓటు`: కేసీఆర్‌

ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం `ఓటు` అని, దాన్ని ఎవరికో ఇచ్చేసి.. తర్వాత బాధ పడొద్దని హితవు చెప్పారు. ఈ హేరాఫేరీ, గోలామాల్‌ ఎన్నికలు ఎందుకొచ్చాయో మీకు తెలుసన్నారు. వాళ్ల అహంకారం.. గర్వం ఏంటి.. అని ప్రశ్నించారు. ఇవి  ఉప ఎన్నికలు కావని.. దేశానికి సందేశం పంపే ఎన్నికలని చెప్పారు. `మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు. మన జీవితాల ఎన్నిక. మన బతుకుదెరువు ఎన్నిక` అని చెప్పారు. దీని వెనకున్న మాయ ఏంటో గుర్తించాలని కోరారు.