అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాలపై వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు
అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ తన కార్యవర్గంలో వివేక్ రామస్వామికి, ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలపై వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో భారీ కోత విధించే అవకాశం ఉందని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు సంబంధించిన ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫెడరల్ బ్యూరోక్రాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను సామూహికంగా తొలగించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, తద్వారా దేశాన్ని కాపాడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.