Home Page SliderNationalNews AlertSportsviral

యువ క్రికెటర్‌పై విరాట్ కోహ్లి స్లెడ్జింగ్..

స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లి అంటే అభిమానులకు దేవుడు కానీ, నిన్న పంజాబ్ మ్యాచ్‌లో విరాట్ చేసిన పని అభిమానులకు కూడా నచ్చలేదు. ఎందుకంటే ఒక యువ క్రికెటర్‌ను కోహ్లి స్లెడ్జింగ్ చేశాడు.  పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముషీర్ ఖాన్‌ను ‘వాటర్ బాయ్’ అంటూ కోహ్లి అనుచిత వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో ముషీర్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చారు. దీనితో ‘నీళ్లు అందించే వ్యక్తి బ్యాటింగ్‌కు వచ్చాడు’ అంటూ చులకనగా మాట్లాడాడు కోహ్లి. దీనితో యువ ఆటగాడిని కోహ్లి అలా ఎగతాళి చేయడం క్రీడాభిమానులకు నచ్చలేదు. దీనితో సోషల్ మీడియాలో కోహ్లి ఇలా స్లెడ్జింగ్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. కొందరు ఆర్సీబీ అభిమానులు మాత్రం కోహ్లిని వెనకేసుకొచ్చారు. ముషీర్ ఖాన్‌కు కూడా కోహ్లి అంటే చాలా అభిమానమని, తమ్ముడిలాంటి వాడని ఆటపట్టించాడని సమర్థిస్తున్నారు.