RCB కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ
ఈ IPL సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్‌గా ఇప్పటివరకు డూప్లిసెస్ వ్యవహరించారు. కాగా ఆయన గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఆ జట్టు కెప్టెన్‌గా కోహ్లీ పగ్గాలు చేపట్టారు. సోమవారం బెంగుళూరులో జరిగిన RCB Vs CSK మ్యాచ్‌లో డూప్లిసెస్ గాయంతో ఉన్నప్పటికీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. అయితే ఈ మ్యాచ్‌లో RCB తుదివరకు పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే డూప్లిసెస్ మ్యాచ్‌ను వీడనట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాబ్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో సామ్ కర్రన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. కాగా ఈ రోజు జరగబోయే RCB Vs PBKS మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

