Home Page SliderNational

విరాట్,గంభీర్ కొంపముంచిన వాగ్వాదం

Share with

ఈ IPL సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. కాగా ఈ సీజన్‌లో జట్టులన్నీ నువ్వా-నేనా అని మ్యాచ్‌లోనే కాకుండా..మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా తలపడుతున్నారు. దీని ఫలితంగా వారు భారీ జరిమానాకు గురవుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఫీజులో 10% కోతకు గురయ్యారు. అయితే తాజాగా మరోసారి బీసీసీఐ ఆయనకు ఫీజులో భారీ కోత విధించింది. విరాట్‌తోపాటు లఖనవూ జట్టు మార్గదర్శకుడు గౌతమ్ గంభీర్‌కు కూడా ఫీజులో కోత విధించినట్లు బీసీసీఐ పేర్కొంది. మొన్న జరిగిన RCB Vs LSG మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి,గౌతమ్ గంభీర్‌కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళిని  ఉల్లంగించిన కోహ్లీ-గంభీర్‌లకు రిఫరీ 100% శాతం ఫీజులో కోత విధించాడు. ఈ IPL సీజన్‌లో కోహ్లీ మ్యాచ్‌కు రూ. 1.07 కోట్ల చొప్పున ఫీజు అందుకుంటున్నారు. అయితే గంభీర్ మెంటర్‌గా మ్యాచ్‌కు రూ.25 లక్షలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా మ్యాచ్ అనంతరం విరాట్-గంభీర్ ఒకరినొకరు దూషించుకోవడం,బహిరంగంగా అనుచితంగా ప్రవర్తించడంతో ఐపీఎల్ ఈ శిక్షను విధించింది. వీరితోపాటు విరాట్‌తో గొడవ పడిన లఖ్‌నవూ పేసర్ నవీనుల్ హక్‌కు ఫీజులో 50%కోత విధించారు.