Home Page SliderNationalSpiritual

వీఐపీలు కుంభమేళాకు ఆరోజు రావొద్దు..

యూపీలోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  పుణ్యస్నానాల కోసం దేశవిదేశాల నుండి కోట్లకొలది భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ నెల 29న వచ్చే మౌని అమావాస్య రోజు మాత్రం వీఐపీ భక్తులు కుంభమేళాకు రాకుండా ఉంటే మంచిదని ప్రభుత్వం హెచ్చరించింది. ఎందుకంటే ఆరోజు ప్రముఖులకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని, వీఐపీ జోన్ ఉండదని, వాహనాలను అనుమతించబోమని వెల్లడించారు. ఆ రోజు దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే అవకాశం ఉందని, దీనికోసం 12 కిలోమీటర్లు పొడవైన ఘాట్‌ను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాక 144 ఏళ్ల అనంతరం సౌరకుటుంబంలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలో వచ్చే అరుదైన కలయిక కూడా ఏర్పడనున్న సందర్భం కావడంతో భారీ రద్దీ ఉంటుంది కాబట్టి ముఖ్య పర్వదినాలలో వీఐపీలు రావొద్దని సూచించింది. జనవరి 29 -మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి పర్వదినాలలో ఈ కుంభమేళాకు భారీ ఎత్తున భక్తులు హాజరవుతారు.