నిజామాబాద్ మేయర్ భర్తపై కిరాతక దాడి
తన స్థలం కబ్జా చేశాడని ఆరోపిస్తూ ఏకంగా మేయర్ భర్తపైనే ఓ ప్రబుద్దుడు దాడి చేసిన ఘటనలో పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. గ్రేటర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నీతూ కిరణ్ భర్త శేఖర్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం సాయంత్రం ఓంటరిగా రోడ్డు వెంబడి నిలబడి ఉన్న సమయంలో తన భూమి కబ్జా ఎందుకు చేశావ్ అని నిలదీస్తూ నిందితుడు…. శేఖర్ చెంప చెళ్లుమనిపించాడు.అంతటి ఆగలేదు…ఒకే ఒక్క దెబ్బతో నేలకొరిగిన శేఖర్‌ని తన బూటు కాలితో తన్నాడు.ఆటోలో తన వెంట తెచ్చుకుని ఇనుప సుత్తితో శేఖర్ పై దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న కొంత మంది వారించేందుకు ప్రయత్నించగా … వారిని కూడా దుండగుడు బెదిరించాడు. క్షత గాత్రుణ్ణి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

