‘ఈనిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు’..మంత్రి వార్నింగ్
రోడ్డు భద్రత నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ సర్కారు హెచ్చరిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవింగ్ విషయంలో నిబంధనలు పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు వంటి విషయాలలో ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రూపొందించిందని, వాటి ప్రకారమే నడుచుకోవాలని హెచ్చరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను హెచ్చరించారు. లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. లక్డీకపూల్‌లో రవాణా శాఖ సాంకేతిక అధికారులతో సమావేశంలో ఈ విషయంపై చర్చించారు.

