‘మిటూ’ అంటూ డబ్లూఎఫ్‌ఐ ఛీప్‌పై విరుచుకు పడుతున్న వినేష్ ఫొగట్
భారత మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల విషయంలో డబ్లూఎఫ్‌ఐ ఛీప్ బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవలంటూ కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. స్టార్ రెజ్లర్ ఒలింపిక్ విజేత వినేష్ పొగట్ కూడా వారికి అండగా నిలిచింది. తాను కూడా బాధితురాలినే అంటూ వారికి మద్దతుగా నిలిచింది. అధికారంలో ఉన్న వ్యక్తి తన అధికార దుర్వినియోగానికి పాల్పడినా కూడా ప్రభుత్వాలు చాలాకాలంగా చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు చేసింది.

బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ కొన్ని నెలలుగా వారు ఉద్యమిస్తున్నారు. రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేసి, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు మొత్తం వివరించి మూడు నాలుగు నెలలు గడిచినా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మహిళలను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న వారికి తగిన శిక్ష పడాలంటూ నినాదాలు చేశారు. కేవలం కంటి తుడుపు చర్యగా ఒక కమిటీని వేసి, చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ వారు ఈ ఆరోపణల నుండి తప్పించుకోవడానికి ఒలింపిక్ సెలక్షన్స్‌లో కొత్త రూల్స్ పెడుతున్నారని, దానిని వ్యతిరేఖిస్తున్నామని పేర్కొన్నారు. గత వారం రోజులుగా జంతర్ మంతర్ వద్దే నిద్రిస్తూ వారి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సాక్షి మాలిక్ మాట్లాడుతూ మా మన్‌కీ బాత్ ప్రధాని మోదీ వినాలని కోరారు. చివరికి మంత్రి స్మృతి ఇరానీ కూడా వారిని పట్టించుకోవడం లేదని, ఈ కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించడం ద్వారా వారికి కాంతిమార్గంలో నడిపిస్తామని తెలియజేసింది.