BusinessHome Page SliderInternationalNews Alert

ఒక్కసారిగా వచ్చిపడిన వేల కోట్లు.. ఏం చెయ్యాలో తెలియని వినయ్

అమెరికాలోని భారత సంతతికి చెందిన వినయ్ హిరేమత్ అనే 35 ఏళ్ల యువకుడు లూమ్ అనే టెక్ సంస్థను స్థాపించి, కొన్నాళ్ల తర్వాత దానిని అట్లాసియన్ సంస్థకు అమ్మేశారు. ఆ విక్రయం ద్వారా వినయ్‌కు 975 మిలియన్ డాలర్ల సొమ్ము దక్కింది. భారత కరెన్సీలో రూ.8 వేల కోట్లు. మరొకరైతే ఈ సొమ్మును ఎలా ఉపయోగిస్తారో ఏమో కానీ, వినయ్‌కి మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాలేదట. తన బ్లాగులో ఈ విషయం రాస్తూ, ‘ఊహించని విధంగా కోట్లు వచ్చాయి. కానీ జీవితంపై నేను సందిగ్ధంలో ఉన్నానని’ పేర్కొన్నారు. ఈ కంపెనీ అమ్మిన తర్వాత వినయ్ తన ప్రియురాలితో కలిసి ప్రయాణాలు చేసి, ఎన్నో ప్రాంతాలు తిరిగారట. కానీ అనంతరం వారిద్దరూ విడిపోయారు. ఆమెకు కావలసినట్లు ఉండలేకపోయానని పేర్కొన్నారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వారితో పని చేయాలని ప్రయత్నం చేసినా కుదర్లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హవాయి ద్వీపంలో ఫిజిక్స్ నేర్చుకుంటున్నానని తెలిపారు.