Home Page SliderTelangana

బస్సు సౌకర్యం లేని పల్లెలు

చిన్నంబావి: జిల్లాలో ఇప్పటికీ పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు: బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండడంతో ఇదే అదనుగా భావించి  మితిమీరిన సంఖ్యలో ప్రయాణీకులను ఎక్కిస్తున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశమెక్కువ. సరైన రవాణా వ్యవస్థ లేక విద్యార్థులు స్కూళ్లకు రోడ్లపై, రైల్వే ట్రాక్‌లపై నడుస్తూ అవస్థలు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్నా టైమ్‌కు రావు. కరోనా ముందు బస్సు సౌకర్యం ఉండేది అనంతరం పూర్తిగా నిలిచిపోయిన బస్సులు. ప్రభుత్వం మారిన సందర్భంగా ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి.