Home Page SliderTelangana

7 నెలల పాలనలో గ్రామాలను పట్టించుకోలేదు: హరీష్‌రావు

టిజి: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలల్లో గ్రామాలకు రూపాయి కూడా నిధులు  ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ భవన్‌లో మీడియాకు తెలిపారు. స్థానిక సంస్థల పాలక వర్గాలకు కాలం చెల్లినా ప్రభుత్వం ఎన్నికల ఆలోచన చేయట్లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలన్నారు.