బాలివుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పై విక్రమ్ కామెంట్స్
విక్రమ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అపరిచితుడు. 2005 లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా రీమెక్ చేయనున్నట్లు 2021 లో డైరెక్టర్ శంకర్ ప్రకటించారు. అయితే ఈ చిత్ర నిర్మాత హిందీ రీమేక్ కు సంబంధించిన ఆర్థిక అంశాలపై కోర్టుకెక్కారు.
తాజాగా తంగలాన్ మూవి ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో విక్రమ్ కి అపరిచితుడు హిందీ రీమేక్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దాంతో విక్రమ్ నవ్వుతూ “అపరిచితుడు రీమేక్ గురించి శంకర్ కు మాత్రమే తెలుసు. రీమేక్ నాతో ఎందుకు తీయడంలేదని ఆయననే అడగండి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణ్‌వీర్ ఒకరు. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. రణ్‌వీర్‌ని ‘అపరిచితుడు’ పాత్రలో చూడాలని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.