Home Page SliderTelangana

కలెక్టర్ పై మహిళ దాడి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి జరిగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ పై మహిళా రైతు చేయి చేసుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా లగిచర్లలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు కలెక్టర్, తహశీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లారు. ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామ సభ ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. ఆగ్రహించిన రైతులు అధికారుల కార్లపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళా రైతు కలెక్టర్ పై చేయి చేసుకున్నారు. మరింత ఉద్రిక్తతంగా మారడంతో కలెక్టర్, అధికారులు అక్కడ నుండి వెళ్ళిపోయారు.