విజయ్ బర్తడే వేడుకల్లో అపశృతి
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ పుట్టినరోజు వేడుకలలో అపశృతి చోటు చేసుకుంది. నిప్పు అంటించుకున్న చేతితో ఇటుకలు పగలుకొట్టాలని చూసిన ఒక బాలుడి చేతికి మంటలు అంటుకున్నాయి. దానిని ఆర్పడానికి ప్రయత్నించిన మరో ఇద్దరికి కూడా మంటలు సోకి గాయాలపాలయ్యారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమాన సంఘం కొన్ని విన్యాసాలు ఏర్పాటు చేసింది. ఈ విన్యాసాలలో భాగంగా నిప్పు ఉన్న చేతితో ఇటుకలు పగలుకొట్టాలని ప్రయత్నించే ఒక బాలుడు ఈ ప్రమాదానికి గురయ్యాడు.