చెత్తతో విజువల్ వండర్ గా విజయవాడ స్క్రాప్ పార్క్
విజయవాడ : ఇనుము, ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్, యంత్రాల తుక్కుతో తీర్చిదిద్దిన విభిన్న శిల్పాలతో విజువల్ వండర్ గా చూపరులను ఆకట్టుకుంటోంది విజయవాడ స్క్రాప్ పార్క్. చెత్త నుండి అద్భుత కళాఖండాలు జీవం పోసుకుని కళ్ల ముందు నిలబడినట్లు ఉన్న ఈ పార్క్ విజయవాడ నగరవాసులకూ, సందర్శకులకూ కొత్త ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ అడవి జింక, పక్షులు, జిరాఫీ, డైనోసార్, జింకలు, పందులు వంటి విభిన్న జంతువుల ప్రతిరూపాలు తుక్కు సాయంతో రూపొందించారు. వీటిని చూడగానే నిజమైన జంతువులా కనిపిస్తూ, చిన్నారులనూ పెద్దలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ శిల్పాలు కేవలం కళాఖండాలే కాదు, “స్వచ్ఛ భారత్ – సృజనాత్మక భారత్” అనే సందేశాన్నీ అందిస్తున్నాయి. ఈ విభిన్న శిల్పాలు సోషల్ మీడియా కోసం ఫోటోలు దిగే యువతను, సృజనాత్మకతను ఆస్వాదించే కుటుంబాలను, పిల్లలనూ ఆకర్షిస్తున్నాయి.