‘పోకిరి’ తరహాలో హల్చల్ చేసిన విజయవాడ సీఐ
ఆశిష్ విద్యార్ధి నటనకు ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే.వెండితెర మీద రౌద్రాన్ని, నిజజీవితంలో సాదాసీదాగా ఉండే తత్వాన్ని కలిగిన విలక్షణ విలనిజాన్ని చూపించే నటుడు ఆయనొక్కరే.పోకిరిలో ఆశిష్ విద్యార్ధి పావు భాగం పాత్రను పోషించారు.ఆ విషయం అందరికీ గుర్తుండే ఉటుంది. ముఖ్యంగా బిల్డర్ విశ్వనాథ్, కానిస్టేబుల్ ఆనంద్,రౌడీషీటర్ సత్తెన్నల పాత్రలతో ఆశిష్ చేసిన రియల్ సీన్ ఇప్పటికీ చాలా మంది అనుకరిస్తుంటారు.పద్దూ…. మన మ్యారేజ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ నీకొక షాప్ గిఫ్ట్ గా ఇస్తానంటున్నాడంటూ చేసిన సీన్ తరహాలోనే ..విజయవాడలోని ఓ పోలీస్ స్టేషన్ సీఐ వీరంగం సృష్టించాడు. రెండు రియల్ ఎస్టేట్ వ్యాపారాల మధ్య జోక్యం చేసుకున్నారు.ఇద్దరు రియల్టర్ల మధ్యలో వేలుపెట్టాడు.సరిగ్గా పోకిరి తరహాలోనే బిల్డర్ ఉన్న నిర్మాణ ప్రాంతానికి వెళ్లాడు. బిల్డర్ ని బెదిరించాడు. మాట వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తా అన్నాడు.అంతే కాదు…భౌతిక దాడికి కూడా పాల్పడబోయాడు.ఇంత జరుగుతున్నా ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా….జరుగుతున్న భాగోతాన్ని మొత్తం రికార్డ్ చేసి నెట్టింట్లోకి వదిలారు.ఇక చూస్కూ ..నా సామి రంగ…ఆ సీఐ బతుకు బెజవాడ బస్టాండ్ అయ్యిందనుకో. గతంలోనే వివాదాస్పద సీఐగా ముద్రపడిన ఆయనపై అటు సీపి,ఇటు స్పెషల్ బ్రాంచి అధికారులు ఫోకస్ చేశారంట. ఇంకేముంది ఖేల్ ఖతం ..దుకాణ్ బంద్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు.