Andhra PradeshHome Page SliderPolitics

విజయసాయి అతడి చేతిలో కీలుబొమ్మ..అంబటి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. విజయసాయి రెడ్డి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లాడని, కీలుబొమ్మగా మారాడని విమర్శలు కురిపించారు. మా పార్టీ నుండి వెళ్లి మామీదే విమర్శలు చేస్తున్నారని, లోకేష్ ఆధ్వర్వంలోనే మంత్రులు, అధికారులు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి స్కామ్‌లు లేకపోయినా కసిరెడ్డిని అరెస్టు చేశారని, ఎస్టిమేషన్లు పెంచి ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. జత్వానీ కేసులో పీఎస్‌ఆర్‌ను అరెస్టు చేయడం అన్యాయమని, ఆమె బ్లాక్ మెయిలర్ అన్నది ముంబయిలో అందరికీ తెలుసన్నారు.