Home Page SliderTrending Today

సమంతకు తెలియకుండా ఆ రీల్ చేసా- విజయ్

‘ఖుషి’ చిత్రం షూటింగ్‌లో సమంతతో కలిసి చేసిన సందడిని హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను సమంతకు తెలియకుండా సర్ప్రైజ్‌గా  చిత్రీకరించానని చెప్పారు విజయ్. మహానటి సినిమా తర్వాత సమంత, విజయ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకుడు. ‘నారోజా నువ్వే’  అంటూ మణిరత్నం సినిమా టైటిల్స్‌తో ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. సంగీత ప్రియలకి హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది ఈ పాట. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.