InternationalNews

భారత్ అబ్బాయికి, పాక్ అమ్మాయికి వీడియో వివాహం

ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో విచిత్ర వివాహం జరిగింది. భారత్-పాకిస్తాన్ మధ్య వివాహ సంబంధాలు అంతగా లేకపోయినా అడపా,దడపా జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కొదవ లేదు. ఈ పరిస్థితులలో పాకిస్తాన్ అమ్మాయికి, భారత్ అబ్బాయికి వివాహం జరిగింది. అది కూడా బీజేపీ నేత దగ్గరుండి వీడియో కాల్‌ ద్వారా వివాహం చేయించారు. జౌన్‌పూర్ బీజేపీ నేత, కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ పాకిస్తాన్‌లోని తమ బంధువుల అమ్మాయితో తన కుమారుని వివాహం నిశ్చయించారు. గతంలోనే వధువు కుటుంబ సభ్యులు  పెళ్లి కోసం వీసాకు అప్లయి చేసుకున్నారని, అయితే ఇంకా మంజూరు కాలేదన్నారు. ఇంతలో వధువు తల్లికి అనారోగ్యం రావడంతో వీడియో కాల్ సహాయంతో ఇరువర్గాల పెద్దలు వివాహం జరిపించారు. వివాహం జరిగిన అనంతరం వధువుకు వీసా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు.