తన టీచర్‌కు పాదాభివందనం చేసిన భారత ఉపరాష్ట్రపతి
ఈ లోకంలో తల్లిదండ్రులు మనకి నడక నేర్పిస్తే..గురువులు మాత్రం విద్యా,బుద్దులు నేర్పించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేస్తారు. కాబట్టే ప్రతి విద్యార్థి జీవితంలో గురువులు ముఖ్య పాత్ర పోషిస్తారు. కాగా మన గురువులు కొవొత్తిలా కరిగిపోతూ..మనకు వెలుగు నిస్తుంటారు. మరి అలాంటి గురువులను గౌరవించడం మనందరి బాధ్యత. అయితే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ కూడా ఇదే నిరూపించారు. తాము ఎంత ఎత్తుకు ఎదిగినా..చదువు చెప్పిన ఉపాధ్యాయులను మరిచిపోకూడదని నేటి తరానికి చాటి చెప్పారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్. కాగా కేరళలోని పన్నియన్నూర్ గ్రామంలో నివాసం ఉంటున్న టీచర్ రత్న నాయర్‌ని..55 ఏళ్ల తర్వాత ఆయన కలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలికేందుకు రత్న నాయర్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి తన టీచర్ రత్న నాయర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఈ సందర్భంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ..ఇది ఎంతగానో మనసుకు హత్తుకుటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.