Home Page SliderNational

వేట్టైయాన్‌: గాంధీ కుటుంబంతో బిగ్ బి రిలేషన్: రజనీకాంత్

వేట్టైయాన్‌: గాంధీ కుటుంబంతో బిగ్ బికి ఉన్న సంబంధాలను, అతను చేసిన పోరాటాలను రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్‌కు అంకితం చేసిన తన భావోద్వేగ ప్రసంగంలో, మెగాస్టార్ ఆర్థిక కష్టాలు, అతను ఎలా తిరిగి సర్వైవ్ అయ్యాడు అనే దాని గురించి రజనీకాంత్ మాట్లాడారు. రజనీ గాంధీ కుటుంబంతో బిగ్ బికి ఉన్న సంబంధాన్ని కూడా ప్రస్తావించాడు, పరిశ్రమలో తన వ్యక్తిగత సంబంధాలను ఎప్పుడూ తన పెర్సనల్ పనులకు ఉపయోగించుకోలేదని హైలైట్ చేశాడు. వేట్టైయాన్‌ లాంచ్‌లో రజనీకాంత్ అమితాబ్ బచ్చన్‌ను ప్రశంసించారు. బిగ్ బి తన రాజకీయ సంబంధాలను తాను ఎదగడానికి ఎప్పుడూ  ఉపయోగించుకోలేదని అతను తన ప్రసంగంలో చెప్పాడు. కూలీ ప్రమాదం నుండి బచ్చన్ కోలుకోవడం గురించి కూడా ప్రసంగంలో ప్రస్తావించబడింది. సెప్టెంబరు 20, శుక్రవారం నాడు చెన్నైలో జరిగిన వేట్టైయాన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన చిరకాల సహోద్యోగి, స్నేహితుడు అమితాబ్ బచ్చన్ కోసం హృదయపూర్వకంగా స్పీచ్‌ ఇచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్‌కు అంకితం చేసిన తన ప్రసంగంలో, అతను తన ఆర్థిక కష్టాలను, గాంధీతో తనకు ఉన్న సంబంధాన్ని  ప్రస్తావించాడు. కుటుంబం కోసం బిగ్ బి ఒకప్పుడు చాలా కష్టపడ్డారు. కానీ, తిరిగి పోరాడి గెలిచారు. రాజకీయ కుటుంబంతో ఉన్న పరిచయాలను తాను ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్న విషయాలను రజనీకాంత్ హైలైట్ చేశారు.

వీడియో లాంచ్‌ ద్వారా కనెక్ట్ అయిన బచ్చన్, అతను చెప్పిన మాటలకు తలైవర్‌కు అమితాబ్ థ్యాంక్స్ చెప్పారు. రజనీకాంత్ తన ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు: అమిత్ జీ సినిమాలు తీసి కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఒక దశలో అతను తన వాచ్‌మెన్‌కి కూడా జీతం ఇవ్వలేకపోయారు. అతని జుహూ హోమ్ పబ్లిక్ బిడ్డింగ్‌లోకి వచ్చింది. బాలీవుడ్ మొత్తం అతనిని చూసి నవ్వుకుంది. బచ్చన్ ఎంత నష్టపోయారో అలాగే, అతను కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి గెలుచుకున్నారు. మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. సూపర్ స్టార్‌గా తన జీవితాన్ని కొనసాగించాడు, ప్రపంచం మీ పతనం కోసం వేచి చూస్తోంది, అతను తిరిగి మూడు ఏళ్లలో KBCలో పాల్గొని మొత్తం డబ్బు సంపాదించుకున్నారు, అదే వీధిలోని జుహు ఇంటితో పాటు తిరిగి మూడు ఇళ్లను  కొనుగోలు చేశారు. అతను అలాంటి ప్రేరణ గల వ్యక్తి. అతని వయస్సు 82 ఏళ్లు, అతను రోజుకు ఇప్పటికీ 10 గంటలు పని చేస్తున్నారు.

రజనీకాంత్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ గురించి కూడా మాట్లాడారు, అతను ప్రముఖ రచయిత. సినీ పరిశ్రమను తన సొంత అవసరాలకు అమితాబ్ ఎప్పుడూ ఉపయోగించలేదని రజనీ షేర్ చేశారు. అమితాబ్ జీ తండ్రి గొప్ప రచయిత. అతను తన ఉనికిని చాటుకోడానికి ఏదైనా చేయగలడు. కానీ కుటుంబ ప్రభావం లేకుండా తనకు తానుగా అలా ఆ స్థాయికి వచ్చారు, అతను ఒంటరిగానే కెరీర్‌కు వచ్చారు. 73 ఏళ్ల వయసులో వృద్ధుడు బచ్చన్ పడ్డ కష్టాలు అనుభవించిన ఘోరమైన కూలీ షూటింగ్‍‌లో ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఒకసారి అమితాబ్‌కి ఘోరమైన ప్రమాదం జరిగింది.. ఆ సమయంలో ఇందిరాగాంధీ విదేశాల్లో ఓ కాన్ఫరెన్స్‌కి వెళ్లారు.. ఆ ప్రమాదం గురించి తెలియగానే వెంటనే ఇండియా వచ్చారు.. అప్పుడే రాజీవ్‌గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారని అందరికీ తెలిసింది. ఆ విషయాలను షేర్ చేశారు.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ 33 ఏళ్ల తర్వాత వెట్టైయాన్ సినిమాలో మళ్లీ కలిసి పనిచేస్తున్నారు, వారి చివరి స్క్రీన్ ఔట్ హమ్. ఇద్దరూ ఒకరికొకరు అపారమైన ప్రేమను, గౌరవాన్ని పంచుకుంటారు. అదే సమయంలో, TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టైయాన్‌లో మంజు వారియర్, రిత్కా సింగ్, దుష్రా విజయన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి తదితరులు కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ సమకుర్చారు. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.