Home Page SliderTelangana

ప్రధాని మోదీతో వెంకట్ రెడ్డి భేటీ, ఇప్పుడు నేను ఫ్రీబర్డ్

ప్రజా సమస్యలపై పోరాడతా… నేను కాంగ్రెస్ పార్టీలో ఫ్రీ బర్డ్ అన్నారు వెంకట్ రెడ్డి. పార్టీ గురించి అడగొద్దన్నారు. ఎన్నికలకు నెల ముందు మాట్లాడతానన్న వెంకట రెడ్డి.. తాను ఇకపై కేవలం లోక్ సభ సభ్యుడు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో లేనని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని మోదీతోపాటు, మంత్రులతోనూ మాట్లాడుతున్నానన్నారు. ప్రధాని మోదీ తనకు 20 నిమిషాలకు సమయమిచ్చి మాట్లాడారన్నారు. అడిగిన మూడు రోజుల్లోనే తనకు అపాయింట్మెంట్ ఇచ్చి గౌరవించారన్నారు. భువనగిరితోపాటు, తెలంగాణలోని అనేక సమస్యలపై వారితో మాట్లాడానన్నారు. ముసీ నది, తెలంగాణ నది అని, తెలంగాణ వికారాబాద్ అడవుల్లో పుట్టి నల్గొండ జిల్లా మీదుగా కృష్ణ నదిలో కలుస్తోందని… పై నుంచి వచ్చే నది కాదని.. మోదీకి సవివరంగా చెప్పానన్నారు వెంకట్ రెడ్డి. తెలంగాణలో డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ నాడు నిజామ్ కాలంలో నిర్మించారని చెప్పానన్నారు. పాలకులు పట్టించుకోకపోవడం వల్ల డ్రైనేజ్ వాటర్, ఇండస్ట్రియల్ వేస్టేజీ వస్తోందన్నారు. మూసీ రివర్ కంటామినేషన్ అయిపోయిందన్నారు. గుజరాత్‌లో సబర్మతి నదిని, యూపీలో గంగానదిని ప్రక్షాళన చేసినట్టుగా, మూసీ నదిని చేయాలని మోదీని కోరానన్నారు. తక్షణం తాను మూసీ ప్రాజెక్టుపై దృష్టి సారిస్తానని మోదీ హామీ ఇచ్చారని వెంకట్ రెడ్డి తెలిపారు.