ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామి ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వైసీపీకి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోన రఘుపతి రాజీనామా చేయడంతో డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీలో బలాన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ పోటీ చేయలేదు. వీరభద్రస్వామి నామినేషన్ ఒక్కటే రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్ చైర్ వద్దకు సీఎం జగన్, విపక్ష నేత అచ్చెన్నాయుడు తోడుకొని వెళ్లారు. రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్తవారికి అవకాశం కల్పించాలన్న జగన్ విధానంలో భాగంగానే రఘుపతి రాజీనామా చేశారని, వీరభద్రస్వామిని ఎన్నుకున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

